భారతదేశం, మార్చి 29 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ భారీ అంచనాలతో వచ్చింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించటంతో పాటు ఓ కీలకపాత్ర పోషించారు. ఈ వారమే మార్చి 27న రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. 2019లో వచ్చిన బ్లాక్‍బస్టర్ లూసిఫర్‌కు సీక్వెల్‍గా ఈ చిత్రం వచ్చింది. ఎల్2: లూసిఫర్ చిత్రం రెండు రోజుల్లోనే ఓ మైల్‍స్టోన్ దాటి రికార్డు సృష్టించింది.

ఎల్2: ఎంపురాన్ చిత్రం రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన ఆశీర్వాద్ సినిమాస్ ప్రకటించింది. "48 గంటల్లోనే ఎంపురాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించింది. సినిమాటిక్ హిస్టరీలో కొత్త బె...