Hyderabad, మార్చి 17 -- L2 Empuraan Release Date Announced: మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా 'ఎల్2 ఎంపురాన్'ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు పెంచిన ఎల్2 ఎంపురాన్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఎల్2 ఎంపురాన్ మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్‌ చేశారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా తెరపైకి మళ్లీ రాబోతోన్నారు.

ఎల్2 ఎంపురాన్ చిత్రంలో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు స్టార్ హీరో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ...