Hyderabad, మార్చి 31 -- L2: Empuraan Controversy: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఎల్: ఎంపురాన్ మూవీ రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ సినిమాలో గోద్రా అల్లర్లు, విలన్ పేరుపై తీవ్ర దుమారం రేగింది. సినిమాలో కొన్ని కీలకమైన సీన్లను 3 నిమిషాల పాటు కట్ చేసినా వివాదం మాత్రం ఆగడం లేదు. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ ఈ మూవీని తాను చూడబోనని స్పష్టం చేశారు.

కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై స్పందించారు. తాను ఇప్పటి వరకూ ఈ మూవీ చూడలేదని, ప్రస్తుతం నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇక చూడబోనని స్పష్టం చేశారు. "నేనింకా సినిమా చూడలేదు. ప్రీక్వెల్ లూసిఫర్ చూశాను. అదో మంచి థ్రిల్లర్ మూవీ. ఆ సినిమాను ఎంజాయ్ చేశాను. నేను మోహల్ లాల్ కు పెద్ద అభిమానిని.

ఈ సీక్వెల్ కూడా చూస్తానని గతంలో చెప్పాను. ఓ సినిమాను సినిమాగా చూడాలన్న పార్టీ నిర్ణయం కూ...