Hyderabad, ఫిబ్రవరి 26 -- Game Of Thrones Actor Jerome Flynn In L2 Empuraan: గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ఎంతగానో అలరించింది. అందులో ఒకటే బ్రాన్ క్యారెక్టర్. డబ్బు కోసం మాత్రమే పని చేసే ఈ పాత్రలో హాలీవుడ్ యాక్టర్ జేరోమ్ పాట్రిక్ ఫ్లిన్ ఒదిగిపోయి నటించాడు.

కామెడీ, యాక్షన్ సీన్లలో అదరగొట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జెరోమ్ ఫ్లిన్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో నటించనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఎల్2 ఎంపురాన్. మొదటి సినిమాకు లాగే ఈ మూవీకి కూడా సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌ బస్టర్ కాంబో 'L2 ఎంపురాన్' మార్చి 2...