భారతదేశం, మార్చి 4 -- Kurnool Crime : క‌ర్నూలు జిల్లాలో ఘోర‌మైన సంఘట‌న చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇంటి వ‌ద్ద ఆడుకుంటున్న చిన్నారిపై అత‌డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కౌతాళం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఒక గ్రామంలో సోమ‌వారం చోటు చేసుకుంది. మ‌న‌వ‌రాలి వ‌య‌సున్న నాలుగేళ్ల చిన్నారిపై పెద్ద మారెప్ప అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం కౌతాళం మండ‌లంలోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్న దంప‌తుల‌కు న‌లుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లల‌ను ఇంటికి స‌మీపంలోని ఉండే పెద్ద మారెప్ప అనే వ్యక్తి ఆడిస్తూ చ‌నువుగా ఉండేవాడు.

అయితే సోమ‌వారం త‌ల్లి బ...