భారతదేశం, మార్చి 15 -- కర్నూలు నగరంలోని శరీన్‌నగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కోశపోగు సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అదే కాలనీలో.. సంజన్నను దుండగులు కత్తులతో నరికి చంపడం సంచలనంగా మారింది. ఈ హత్య తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వ్యక్తి వాహనంపై సంజన్న అనుచరులు దాడి చేశారు.

శరీన్‌నగర్‌లో నివాసం ఉండే సంజన్న సీపీఎం తరఫున రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్‌గా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి తన కుమారుడు జయరాంను కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. అయితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాటసానితో విభేదించి టీడీపీలో చేరారు. బైరెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య అక్కడే వచ్చింది.

అదే కాలనీలో బైరెడ్డి వర్గీయుడు రౌడీషీటర్‌ వడ్డె రామాంజనేయులు అలియాస్‌ వడ్డె అంజి ఉంటున్నారు....