భారతదేశం, ఫిబ్రవరి 5 -- Kurnool Crime : క‌ర్నూలులో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను భ‌ర్త హ‌త‌మార్చాడు. పొలం ప‌నిచేస్తుండ‌గా వెనుక నుంచి క‌త్తితో భార్యపై భ‌ర్త దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలోని తుగ్గలి మండ‌లం రాత‌న‌కొత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు, మృతిరాలి కుటుంబ స‌భ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాత‌న‌కొత్తూరు గ్రామానికి చెందిన కాశీంబీ కూతురు షేక్ మాబున్నీ (32)తో చెన్నంప‌ల్లికి చెందిన అక్బర్‌వ‌లికి వివాహం జ‌రిగింది. 15 ఏళ్ల క్రితం జ‌రిగిన వివాహ అనంత‌రం ఇద్దరు కుమారులు ఆసీఫ్ (12), లాలూసాహెబ్ (9) ఉన్నారు. అయితే భార్య షేక్ మాబున్నీపై భ‌ర్త అక్బర్ వ‌లి అనుమానం పెంచుకున్నాడు.

ఆమె ఎవ‌రితోనైనా మాట్లాడినా స‌హించేవాడు కాదు. దీంతో ఇ...