భారతదేశం, జనవరి 25 -- వారిద్దరూ గతంలో ప్రేమికులు..! కానీ కొన్ని కారణాలతో వారి వివాహనికి అడ్డంకులు ఎదురయ్యాయి. కట్ చేస్తే ప్రియుడికి మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని దూరం పెడుతూ వచ్చాడు. కానీ ప్రియుడు దూరమైపోయాడన్న కారణంతో. ప్రియురాలు మాత్రం పెళ్లి చేసుకోలేదు. పైగా ప్రియుడి భార్యపై కక్ష పెంచుకుంది. ఆమెపై ప్రాణాంతక ఇంజెక్షన్‌తో దాడి చేసింది. నిర్ఘాంతపోయే ఈ ఘటన కర్నూల్ నగరంలో వెలుగు చూసింది.

కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ తెలిపిన వివరా ప్రకారం.. కర్నూల్ సిటీకి చెందిన ఓ వైద్యుడు. వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ కొనసాగింది. కానీ కొన్ని కారణాల రీత్య వీరి వివాహం జరగలేదు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి.శ్రావణి అనే మరో వైద్యురాలితో వివాహమైంది. అప్పట్నుంచి వసుంధరకు దూరంగా ఉంటున్నాడు. దీ...