భారతదేశం, మార్చి 24 -- కమేడియన్​ కునాల్​ కమ్రా తన యూట్యూబ్​- ఇన్​స్టాగ్రామ్​ హ్యాండిల్​లో అప్​లోడ్​ చేసిన లేటెస్ట్​ స్టాండప్​ గిగ్​ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిండేపై పరోక్షంగా 'జోక్​' వేశారు కునాల్​. కానీ అది శిండే మద్దతుదారులకు నచ్చలేదు. ఫలితంగా, కునాల్​ ఆ స్టాండప్​ కామెడీ చేసిన 'యూనికాంటినెంటల్​ ముంబై' హోటల్​పై పలువురు దాడి చేశారు. హోటల్​లో కుర్చీలను ధ్వంసం చేశారు. అంతేకాదు, కునాల్​పై దాడి చేస్తామని కూడా ఏక్​నాథ్​ శిండే శివసేనకు చెందిన కొందరు బెదిరించారు.

శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విడిపోయిన వర్గాలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర రాజకీయాలు, అక్కడి ఎన్నికలపై కునాల్ కమ్రా విమర్శలు గుప్పించారు.

'జో ఇన్హోనే మహారాష్ట్ర కే ఎలక్షన్ మే కియా హై... బోల్నా పడేగా... పెహ్లే శివసేన బ...