భారతదేశం, మార్చి 10 -- Kumaradhara Theertha Mukkoti : తిరుమలలో మార్చి 14(శుక్రవారం)న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 5 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రమే కుమార‌ధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్లడానికి అనుమ‌తి లేదని టీటీడీ తెలిపింది.

గోగ‌ర్భం నుంచి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్రమే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని భక్తులను కోరింది టీటీడీ. పాపవినాశనం నుంచి కుమార‌ధార‌ తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచ...