భారతదేశం, మార్చి 15 -- Kudumbasthan Review: మ‌ణికంద‌న్‌, శాన్వీ మేఘ‌న హీరోహీరోయిన్లుగా న‌టించిన కుడుంబ‌స్థాన్ ఈ ఏడాది త‌మిళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కేవ‌లం ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 28 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కామెడీ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి రాజేశ్వ‌ర్ క‌ళిస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే.

న‌వీన్(మ‌ణికంద‌న్‌) ఓ యాడ్ డిజైనింగ్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. వెన్నెల‌ను(శాన్వీ మేఘ‌న‌) ప్రాణంగా ప్రేమిస్తాడు. కులాలు వేరు కావ‌డంతో న‌వీన్, వెన్నెల పెళ్లికి ఇరు కుటుంస‌భ్యులు ఒప్పుకోరు. పెద్ద‌ల‌కు తెలియ‌కుండా స్నేహితుల స‌హ‌కారంతో లేచిపోయిపెళ్లిచేసుకుంటారు. న‌వీన్ ఆదాయ‌మే త‌మ కుటుంబానికి ఆధారం కావ‌డంతో ఇష్టం లేక...