భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందన్న కేటీఆర్.. 14 నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకున్నా.. రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు.

'సీఎం రేవంత్‌ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్‌ కరవు తీసుకొచ్చింది. రేవంత్‌కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్‌ని ఖతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు' అని కేటీఆర్ వ్యాఖ్...