భారతదేశం, జనవరి 28 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతిని సాధించిందని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్ల.. తెలంగాణ భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారిందని అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారు. ధన్యవాదాలు చంద్రబాబు గారూ. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడికి దయచేసి అవగాహన కల్పించండి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు మాట్లాడిన వీడియోను జత చేశారు.

దావోస్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత.. అమ...