తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- 2025-2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఆరోపించారు. ఈ బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్నా అని. ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది. ఇది 40 శాతం కమీషన్ల కాంగ్రెస్ బడ్జెట్. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడంపైననే దృష్టి. ప్రజల కష్టాలుపైన ధ్యాసలేని బడ్జెట్. ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టే కుట్ర చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే" అని కేటీఆర్ విమర్శించారు.

"ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జ...