తెలంగాణ,నల్గొండ, మార్చి 20 -- నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని ఆరోపించారు.

కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించేందుకు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్నుల కొద్ది అభిమానం అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉంటుందని చెప్పారు.

"ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్‌కు పోరాటనామ సంవత్సరమే. అందుకు ఏప్రిల్ 27న తొలి అడుగుపడబోతుంది. దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేవారు.. దాన్ని మార్చిన నాయక...