భారతదేశం, మార్చి 24 -- KTR Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఒకే రకంగా ఉందని ఆ రెండు పార్టీలు దొందు దొందేనని కేటీఆర్‌ విమర్శించారు.టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ సభపై కరీంనగర్ లో కేటిఆర్ టిఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై కరీంనగర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వి కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు బిజెపి వైఖరిపై ఫైర్ అయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులేనని కేటిఆర్ ఆరోపించారు. రూ. 15 లక్షలు...