భారతదేశం, మార్చి 10 -- అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని.. కేసీఆర్ స్థాయి వేరు.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. మోదీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని.. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడు అని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం ముందుపడి కృషి చేసింది మేము. కానీ వాళ్లు పేరు పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వెనక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు. వందల, వేల కోట్ల కుంభకోణం కోసం నలుగురు బ్రోకర్లతో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన చుట...