తెలంగాణ,హైదరాబాద్, జనవరి 16 -- ఫార్ములా-ఈ రేసులో ఒక్క పైసా అవినీతి జరగకున్నా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం కేస్ పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన. ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు అడిగిన ప్రశ్నలే గంటల తరబడి అడిగారని చెప్పారు. ఎన్ని సార్లు విచారణకు పిలిచిన హాజరవుతానని. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తాని ఉద్ఘాటించారు.

రేవంత్ రెడ్డి కక్ష్యసాధింపు చర్యలో భాగంగానే తనపై కేసు నమోదైందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసు ఉంది కాబట్టే. తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.

"రేవంత్ తో లై డిటెక్టర్ టెస్ట్‌ కైనా నేను సిద్దం. ఇద్దరం న్యాయమూర్తి ముందు కూర్చుందాం. ప్రజలందర...