భారతదేశం, ఫిబ్రవరి 4 -- KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ... 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే అన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు శాంతి కుమారి, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా వీళ్లు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారన్నారు.

గతంలో ప్రభుత్వమే సర్వే చేసిందని, వాటిని ఓపెన్‌గా వెబ్‌సైట్‌లోనే పెట్టామన్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే, రేవంత్ రెడ్డి ప్రజలకు తమ వివరాలు ఇవ్వద్దని బహిరంగంగా పిలుపునిచ్చారన్నారు.

"కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో బిల్లు ఏమైన...