భారతదేశం, ఏప్రిల్ 12 -- KTR : కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ కావాలని కోరిక ఉండేది, పొలిటికల్ లీడర్ ను అయి ప్రజాసేవకు అంకితమయ్యానని స్పష్టం చేశారు. డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50% జబ్బు నయమవుతుంది, అది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని తెలిపారు.

కరీంనగర్ లో చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే కు కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, చైల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, వ్యవస్థాపకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదని, కానీ ఇక్కడ...