భారతదేశం, మార్చి 2 -- KTR : సాగునీరు అందక ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సాగునీటి విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేయకుంటే మంత్రి ఛాంబర్ లో బైఠాయించి ధర్నా చేస్తానని రైతులతో కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన పంట పొలాలను కేటీఆర్ పరిశీలించారు. సాగునీరు అందక నెర్రలు బారిన వరి పంట పొలాన్ని పరిశీలించి రైతుల ఆవేదన ఆక్రందనను ప్రత్యక్షంగా చూశారు. సాగునీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని కేటీఆర్ ను రైతన్నలు వేడుకున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటిఆర్ ఆరోపించారు.

కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీ...