భారతదేశం, జనవరి 28 -- భారత మార్కెట్లో స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లను విక్రయించే కేటీఎమ్ తన పోర్ట్ ఫోలియోలో కొత్త మోడల్‌ను తీసుకువస్తుంది. కొత్త 390 అడ్వెంచర్ ఎస్ బైక్‌ను జనవరి 30, 2025న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త మోడల్‌తో భారత మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కేటీఎమ్ లక్ష్యంగా పెట్టుకుంది. పెర్ఫార్మెన్స్, అడ్వెంచర్, స్టైల్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. యూత్‌ ఎక్కువగా ఈ బైక్ ఇష్టపడేలా డిజైన్ చేశారు.

కొత్త 390 అడ్వెంచర్ ఎస్, 390 ఎండ్యూరో ఆర్‌తో సహా కేటీఎమ్ 390 లైనప్‌లో భాగం. గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్(ఐబీడబ్ల్యూ)లో ఈ రెండు మోటార్ సైకిళ్లు భారత్‌లో అరంగేట్రం చేశాయి. అక్కడ కేటీఎమ్ ఈ మోడళ్లను పరిచయం చేసింది. పాపులర్ 390...