భారతదేశం, నవంబర్ 1 -- ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, దేవుత్తని ఏకాదశి మరుసటి రోజున శుక్ల పక్షం ద్వాదశి రోజున తులసి వివాహం జరుగుతుంది. దీనినే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుతాము. ఈ సంవత్సరం నవంబర్ 2, 2025 ఆదివారం జరగనుంది. కార్తీక శుక్ల ద్వాదశి తిథి నవంబర్ 2న ఉదయం 7:31 గంటలకు ప్రారంభమై నవంబర్ 3 ఉదయం 5:07 గంటల వరకు కొనసాగుతుందని పండితులు తెలిపారు.

దీనికి ఒక రోజు ముందు, విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభిస్తాడు. అందువల్ల, ఈ రోజున, తులసి మాత మరియు విష్ణువు (శాలిగ్రామ రూపం) వివాహం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి వివాహం ఇంటికి సంతోషం, అదృష్టం మరియు సంవృద్ధిని తెస్తుందని చెబుతారు. ఈ వివాహం లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తులసి వివాహం సంపూర్ణ ఆచారాలతో చేస్తే ఇంట్లో సంపద మ...