Hyderabad, జూలై 30 -- Kriti Sanon Smoking: వన్ నేనొక్కడినే, ఆదిపురుష్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. ఇప్పుడామె గ్రీస్ లో సిగరెట్ తాగుతూ కెమెరాలకు దొరికిపోయింది. ఆమెకు అలవాటు కాదు కదా.. పక్కన వాళ్లు సిగరెట్ తాగుతున్నా ఆమె వారిస్తుందంటూ కృతి తల్లి గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆదిపురుష్ మూవీలో సీతగా నటించి మెప్పించింది కృతి సనన్. ఆమె జులై 27న తన బర్త్ డే జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్ కోసం కృతి తన సోదరి నుపుర్, బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి గ్రీస్ వెళ్లింది. అక్కడ ఎవరో అభిమాని తీసిన వీడియోలో కృతి ఓ రెడ్ డ్రెస్ లో కనిపించింది. ఆ వీడియో చివర్లో కృతి చేతుల్లో సిగరెట్ కనిపించినట్లు ఓ రెడిట్ యూజర్ దానిని పోస్ట్ చేశారు.

దీంతో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హ...