భారతదేశం, నవంబర్ 30 -- Kriti Clarity on Dating Rumours: పాన్ఇండియా స్టార్ ప్రభాస్‌తో కృతిసనన్ డేటింగ్‌లో ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. ఈ విషయాన్ని ఇటీవలే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కన్ఫార్మ్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఓ రియాల్టీ షోలో పాల్గొన్న వరుణ్.. కృతి ఒకరి మనస్సులో ఉందంటూ పరోక్షంగా ప్రభాస్ గురించి ప్రస్తావించాడు. దీంతో ఆమె ప్రభాస్‌ను ప్రేమిస్తుందని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు విస్తృతంగా వచ్చాయి. తాజాగా వీటన్నింటికీ చెక్ పెట్టేసింది హీరోయిన్ కృతిసనన్. ఇవన్నీ వట్టి పుకార్లని తేల్చిచెప్పింది.

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీని పోస్ట్ చేసింది కృతిసనన్. "ఇది ప్రేమ(ప్యార్) కాదు.. పీఆర్ కాదు. మా భేడియా టీమ్ రియాల్టీ షోలో కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. అతడి(వరుణ్ ధావన్) పరిహాసం...