భారతదేశం, ఫిబ్రవరి 16 -- Krishnaveni: టాలీవుడ్ సీనియర్ న‌టి, నిర్మాత కృష్ణవేణి క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ‌వేణి ఆదివారం ఉద‌యం తుది శ్వాస విడిచింది. కృష్ణ‌వేణి వయసు 101 సంవత్సరాలు. డిసెంబర్ 24, 1924 లో కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో కృష్ణ‌వేణి జ‌న్మించారు. రంగ‌స్థ‌ల క‌ళాకారిణిగా ఆమె న‌ట జీవితం మొద‌లైంది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సి. పుల్లయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సతీ అనసూయ సినిమాతో 1936లో బాల‌న‌టిగా సినిమా రంగానికి పరిచయమైంది కృష్ణ‌వేణి.

కథానాయికగా ద‌క్ష‌య‌జ్ఞం, జీవ‌న‌జ్యోతి, భీష్మ‌, ఆహుతి, గొల్ల‌భామ‌, మ‌ళ్లీ పెళ్లి, తిరుబాటు, పేరంటాలుతో పాటు ప‌లు సినిమాలు చేసింది కృష్ణ‌వేణి. నిర్మాత‌గా మ‌న‌దేశంతో పాటు ల‌క్ష్మ‌మ్మ‌, భ‌క్త ప్ర‌హ్లాద‌, దాంప‌త్యం సినిమాల‌ను తెర‌కెక్కించింది. బాల‌మిత్రుల క‌థ‌, కీలు...