భారతదేశం, ఫిబ్రవరి 22 -- Krishna Waters Issue : కృష్ణా జలాల పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులలో నీటి మట్టాలు వేగంగా తగ్గుతుండడం, ఆయకట్టు ప్రాంతాలలో తీవ్రమైన నీటి కొరత పరిస్థితులు తెలంగాణ, ఏపీ నీటి వివాదానికి మరించ ఆజ్యం పోశాయి. కృష్ణా బోర్డు(KRMB) ఏపీకి ప్రాధాన్యత ఇస్తుందని, దీంతో తెలంగాణ తన వాటాను వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.

శ్రీశైలం, నాగార్జున సాగర్ పై ఉమ్మడి ప్రాజెక్టుల ప్రస్తుత నిల్వలో భాగంగా అందుబాటులోని నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల నుంచి కార్యాచరణ కోరాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి లేఖ రాసింది. రెండు జలాశయాలలో మిగిలి ఉన్న నీటిని తెలంగాణ వినియోగానికి ప్రత్యేకంగా కేటాయించాలని కోరింద...