భారతదేశం, ఫిబ్రవరి 4 -- Krishna Viral News : బతికుండగానే ఏదైనా...చచ్చాక నేను చూస్తానా? అంటుంటారు ఊళ్లలో వృద్ధులు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలికి వింత కోరిక పుట్టింది. ఆస్తులన్నీ కొడుకులకు పంచేసి...తన చివరి కోరిక తీర్చాలని కోరింది. తాను బతికుండగానే పెద్దకర్మ భోజనాలు పెట్టాలని కొడుకులను పట్టుబట్టింది. చివరకు తన మాట నెగ్గించుకుని...ఊరంతటినీ పిలిచి భోజనాలు పెట్టించుకుంది. ఈ వింత ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్లలో చోటుచేసుకుంది.

ముచ్చర్లలో ఇద్దరు కొడుకులు తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ కార్యక్రమం చేశారు. అయితే తల్లే కావాలని కొడుకులతో పెద్ద కర్మ భోజనాలు పెట్టాలని కోరింది. మొదట కొడుకులు ఒప్పుకోలేకపోయినా.... తల్లి ఒత్తిడితో చివరికి ఆమె కోరికను తీర్చారు.

ముచ్చర్లకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు రంగమ్మ... తన ఆస్తులు అన్నింటినీ కొడుకులకు పం...