Hyderabad, ఫిబ్రవరి 3 -- Krishna Vamsi: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు కృష్ణ వంశీ. తన మార్క్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆ డైరెక్టర్.. 21 ఏళ్ల కిందట శ్రీ ఆంజనేయం అనే మూవీ తీసిన విషయం తెలుసు కదా. ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యత ఉన్న అలాంటి సినిమాలో ఫిమేల్ లీడ్ నటించిన ఛార్మీ కౌర్ ఓవర్ ఎక్స్‌పోజింగ్ చాలా మందిని ఇబ్బంది పెట్టింది. దీంతో ఇప్పుడు దానికి అతడు సారీ చెప్పడం గమనార్హం.

నితిన్ హీరో, ఛార్మీ కౌర్ హీరోయిన్ గా 2004లో వచ్చిన మూవీ శ్రీఆంజనేయం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా.. సినిమాను ఇష్టపడే వాళ్లు కూడా కొందరు ఉన్నారు. అయితే ఈ మూవీపై తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ స్పందించాడు. సోమవారం (ఫిబ్రవరి 3) తన ఎక్స్ అకౌంట్లో ఫాలోవర్లతో అతడు ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని వేసిన ప్రశ్నకు కృష్ణ వంశీ హుందాగా స్పంద...