భారతదేశం, ఏప్రిల్ 6 -- Krishna River Boys Drown : ఏపీలో పండుగ పూట విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు గల్లంతు అయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వెంకట గోపి కిరణ్(15), ఎం.వీరబాబు(15), ఎం.వర్ధన్‌(16) ఆదివారం ఉదయం కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. అయితే వీరు ముగ్గురు నదిలో గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డీఎస్పీ విద్యాశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....