Hyderabad, ఫిబ్రవరి 10 -- Krishna mukunda murari serial february 10 episode: రెండు జంటలు రెస్టారెంట్ కి వెళతారు. ఆదర్శ్ చేతికి దెబ్బ తగలడంతో తనకి అన్నం తినిపించమని కృష్ణ చెప్తుంది. కానీ ముకుంద మురారిని ఊహించుకుంటూ ఆదర్శ్ కి తినిపిస్తుంది. నన్ను క్షమించు ఆదర్శ్ నాకు మురారి మీద ఉన్న ప్రేమని నీమీద చూపించి నిన్ను దారుణంగా మోసం చేస్తున్నానని అనుకుంటుంది. ఇక కృష్ణ ముకుందని ఆదర్శ్ ప్లేట్ లోనే తినమని చెప్తుంది. ముకుంద ఇబ్బంది పడుతుంటే ఆదర్శ్ పర్లేదులే తన ప్లేట్ లోనే తిననివ్వమని అంటాడు.

కృష్ణ గదిలో వాళ్ళ నాన్న ఫోటోకి వేసిన దండ వాడిపోయి కిందపడిపోయి కనిపిస్తుంది. దీంతో కృష్ణ చాలా కంగారుపడుతుంది. పొద్దున వేశాను కదా అప్పుడే ఇలా వాడిపోయింది ఏంటని అనుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అపశకునాలు ఎదురవుతున్నాయి. ఏం జరగబోతుందని కృష్ణ టెన్షన్ పడుతుంది. మురార...