Hyderabad, మే 6 -- Krishna mukunda murari serial today may 6th episode: మురారి పరిమళ ద్వారా తన బిడ్డని మోసే సరోగేట్ మథర్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ తో మాట్లాడతాడు. మధుని వెంటనే తన రూమ్ ఖాళీ చేసి కృష్ణ వాళ్ళకి ఇవ్వమని అంటాడు. అప్పుడే కృష్ణ వస్తే డాక్టర్స్ ఏమన్నారని భవానీ అడుగుతుంది.

మురారి ఎక్కడ ఉన్నాడని అంటే వేరే పని ఉంటే ఆగిపోయాడని క్యాబ్ లో వచ్చేశానని చెప్తుంది. కడుపుతో ఉన్న నిన్ను ఎలా ఒంటరిగా వదిలేస్తాడని వెంటనే మురారికి ఫోన్ చేసి చెడామడా తిట్టేస్తుంది. భవానీ కృష్ణ కడుపుతో ఉందని తెగ హడావుడి చేస్తుంది.

మూడో నెల అయినా తొమ్మిదో నెల అయినా ఒకటే అని కృష్ణకి తెలుసు కానీ కృష్ణకి చెప్పలేదని ముకుంద మనసులో అనుకుంటుంది. పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని ఏదైనా పూజ చేయిద్దామని కృష్ణ అంటుంది. కృష్ణ మీద భవానీ చూపిస్తున్న ప్రేమ చూసి ఆదర్శ్...