భారతదేశం, ఫిబ్రవరి 26 -- Krishna Crime: వివాహితను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు, ఆమె కాదనడంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు స్వ‌ల్ప గాయాలు కాగా, అడ్డొచ్చిన యువ‌కుడికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వారిద్ద‌రిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా గుడివాడ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గుడివాడ ప‌ట్ట‌ణంలోని భీమ‌వ‌రం రైల్వే గేటు ప్రాంతంలో వివాహిత నివ‌సిస్తున్నారు. ఆమెకు భ‌ర్త, ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆమె భ‌ర్త ఆగిరిప‌ల్లిలో ప‌ని చేస్తుండ‌గా, ఆమె మాత్రం గుడివాడ ప‌ట్ట‌ణంలోనే బ్యూటీషియ‌న్‌గా ప‌ని చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఐదేళ్ల క్రితం 2020లో గుడివాడ‌కు చెందిన కె. జ‌గ‌దీష్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దీంతో ఇద్ద...