Hyderabad, ఏప్రిల్ 7 -- RK Naidu About Kousalya Tanaya Raghava Trailer: మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం వెండితెరపై మాస్, మసాలా, యాక్షన్, కామెడీ చిత్రాలే కనిపిస్తున్నాయి. కానీ, స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాలు కనిపించడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేందుకు 'కౌసల్య తనయ రాఘవ' చిత్రం రాబోతోంది.

రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్స్‌గా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా కౌసల్య తనయ రాఘవ మూవీని అడపా రత్నాకర్ నిర్మించారు. ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వర్తించారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కౌసల్య తనయ రాఘవ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆర్కే నాయు...