Hyderabad, ఫిబ్రవరి 25 -- Kousalya Supraja Rama OTT: ఓటీటీలోకి మరో కన్నడ హిట్ మూవీ తెలుగులో రాబోతోంది. ఈ సినిమా పేరు కౌసల్యా సుప్రజా రామా. జులై, 2023లో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ ఇది. ఇప్పటికే కన్నడ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండగా.. తాజాగా తెలుగులోనూ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.

కన్నడలో కౌసల్యా సుప్రజా రామా టైటిల్ తో రిలీజైన ఈ రియలిస్టిక్ డ్రామా మూవీని తెలుగులోనూ అదే పేరుతో నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాను గురువారం (ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది.

"కౌసల్యా సుప్రజా రామా ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో.. మనసును హత్తుకునే ప్రేమ, పరివర్తన, తనను తాను తెలుసుకునే ఓ వ్యక్తి కథ మీ భాషలో.. ఫిబ్రవరి 27 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీట...