Hyderabad, మార్చి 18 -- వేసవి వచ్చేసింది. శరీరంలో వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేసే గుణాలు కలిగిన ముఖ్యమైన ఆహారాల్లో కొత్తిమీర ముందుంటుంది. కాబట్టి ఈ వేసవిలో దీన్ని ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. ఇప్పటివరకూ మీరు కొత్తిమీరతో పచ్చడి చేసుకుని ఉంటారు, కూరల్లో, మజ్జిగల్లో కూడా వేసుకుని తిని ఉంటారు. ఈసారి కొత్తగా కొత్తిమీర దోసలను ట్రై చేయండి.

ఈజీగా త్వరగా తయారయ్యే కొత్తిమీర దోసలు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యను నయం చేస్తాయి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చర్మం నుంచి కళ్ల వరకూ, మధుమేహం నుంచీ గుండెపోటు వరకూ ఎన్నో ప్రాణాంతక వ్యాధును నయం చేసే లక్షణాలు, పోషకాల...