భారతదేశం, ఫిబ్రవరి 4 -- దేశవ్యాప్తంగా 120 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నట్టు.. తాజా బడ్జెట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ఆశలు బలపడుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే దీని నిర్మాణానికి అడుగులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు స్థల పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం రూ.38లక్షలు మంజూరు చేసింది. ఇటీవలే టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ సర్వే పూర్తయ్యింది.

2.కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామవరం- గరీబ్‌పేట గ్రామాల మధ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించింది. చుంచుపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్‌ మండలాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది.

3.ప్రభుత్వం ప్రత...