భారతదేశం, ఏప్రిల్ 15 -- Kotha Prabhakar Reddy : మేము డబ్బులు ఎన్నైనా ఇస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని దించేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతర వ్యాపారాలు తమను కోరుతున్నారని, దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. నిన్న దుబ్బాక లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశం లో మాట్లాడుతూ, ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, వ్యాపారాలు మొత్తమే నడుస్తలేవని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని వ్యాపారులు, ప్రజలు కోరుకుంటున్నారని అయన అన్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి వేసారి పోయారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలన...