భారతదేశం, ఏప్రిల్ 25 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్ లోనే 10 శాతం క్షీణించింది. బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర 10 శాతం క్షీణించి రూ.1,658.75 వద్ద ముగిసింది.

ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్తగా క్రెడిట్ కార్డులను జారీ చేయడం తక్షణమే నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ ను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాల్లో బ్యాంక్ ఐటీ వ్యవస్థలో గణనీయమైన లోపాలున్నాయని ఆరోపిస్తూ ఆర్బీఐ కొటక్ మహీంద్ర బ్యాంక్ పై ఈ ఆంక్షలు జారీ చేసింది.

కొటక్ మహింద్ర బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు ఆర్బీఐ తాజా ఉత్తర్వులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంక్ ప్రస్తుత ఖా...