భారతదేశం, మార్చి 9 -- Kota student death 2024 : విద్యార్థుల సూసైడ్​ పాయింట్​గా మారిన రాజస్థాన్​ కోటాలో మరో కలకలం! ఓ 16ఏళ్ల జేఈఈ విద్యార్థి.. తాజాగా సూసైడ్​ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 'నానాన్న.. నా వల్ల కావట్లేదు,' అంటూ సూసైడ్​ నోట్​ రాసి మరణానికి పాల్పడ్డాడు. తాజా ఘటనతో.. ఈ ఏడాది కోటాలో సూసైడ్​ చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరింది.

బిహార్​కి చెందిన అభిషేక్​ మండల్​.. కోటాలోని ఓ కోచింగ్​ సెంటర్​లో జేఈఈకి ప్రిపేర్​ అవుతున్నాడు. అతని వయస్సు 16ఏళ్లు. ఏడాదిగా ఓ పీజీలో ఉంటూ చదువుకుంటున్నాడు. కోటా విద్యార్థి ఆత్మహత్య లిస్ట్​లో అతను పేరు ఉంటుందని ఎవరు ఊహించలేదు!

కాగా.. గురువారం రాత్రి నుంచి అతడితో మాట్లాడాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ అభిషేక్​ ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. అనంతరం.. పీజీ యజమానికి కాల్​ చేసి, అభిషేక్​ ఫోన్​ లిఫ్ట్​ చేయడ...