భారతదేశం, మార్చి 11 -- Kondaparthy Village : కొండపర్తి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ కుగ్రామం. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని చిన్నపాటి పల్లె. అంతగా అభివృద్ధి కూడా ఎరుగని ఆ ఊరు గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది. గ్రామంలోని ఇళ్లు ధ్వంసం కాగా.. అక్కడి జనాలు కూడా కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అక్కడి ప్రజల దీనావస్థను తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చలించిపోయారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అప్పటి నుంచి ఆ గ్రామానికి మహర్దశ పట్టుకుంది. గవర్నర్ దత్తత తీసుకోవడం, మంత్రి సీతక్క చొరవ కలిసి రావడంతో ఆ ఊరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి వైపు అడుగులు వేయించాలన్న గవర్నర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు గ్రామంల...