భారతదేశం, మార్చి 28 -- Kondagattu Accident: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం నింపింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళిన రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన ఒకరు మృతి చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తండాకు చెందిన శివరాత్రి లింగం-విజయ కుమారుడు శివరాత్రి సాయికృష్ణ (17) తల్లి విజయతో కలిసి కొండగట్టు అంజన్నను దైవ దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం బంధుమిత్రులతో కలిసి కొండగట్టు దిగువన వంటలు చేసుకునేందుకు ఘాట్ రోడ్డులో గట్టు కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు.

టాటా ఏస్ వాహనంలో ఎక్కువ మంది ఉండడంతో సాయికృష్ణతో పాటు మరొకరు టాప్ పై కూర్చున్నారు. కొండ గట్టు ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ సడెన్ గా బ్రేక్ ...