Kondagattu,karimnagar, ఏప్రిల్ 12 -- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరినకోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు బారీగా తరలివస్తున్నారు. జై శ్రీరామ్ నినాధాలు, జయరామ శ్రీరామ జయజయ రామ నామ స్మరణతో కొండగట్టు మారుమోగుతుంది.‌ మాలాధారణతో పాటు మాలవిరమణ చేసే భక్తులతో కాషాయవర్ణ శోభితంగా తయారైంది కొండగట్టు.‌

చైత్రమాసం పౌర్ణమి శనివారం రోజున హనుమాన్ జయంతి కావడంతో లక్షకుపైగా హనుమాన్ దీక్ష స్వాములు అజన్న సన్నధికి చేరారు. భక్తుల రద్దీతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.‌ రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఏపి, మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపద్యంలో నిరంతరాయంగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడంతోపాటు ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చలవ పందిళ్ళు, మంచినీటి సౌకర్యం...