భారతదేశం, జనవరి 9 -- డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్, ఎంపీ శ్రీ హరీష్‌ బాలయోగి, ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్‌తో మండపేట నియోజకవర్గం, రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఘటనా ప్రాంతంలో మంటల తీవ్రత కాస్త తగ్గడం మొదలైనప్పటికీ. వరుసగా ఐదవ రోజు కూడా మంటలు కొనసాగుతున్నాయి. మంటలను పూర్తిగా ఆర్పడానికి తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అగ్నిప్రమాదంలో ధ్వంసమైన కొబ్బరి తోటలు ధ్వంసమైన ...