భారతదేశం, మార్చి 22 -- డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా మండ‌పేట‌లో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌పేట‌లోని 22వ వార్డు మేద‌ర‌పేట వీధిలో సూరా రాంబాబు అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. ఆయ‌న‌కు వ‌స్త్రాల వెంక‌ట దుర్గ అనె కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహం అయింది. కానీ.. రామ‌చంద్ర‌పురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివ‌ర‌పు సురేష్‌తో ఆమె వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది.

ఆమె వివాహేత‌ర సంబంధంపై ఊళ్లోవాళ్లు చ‌ర్చించుకుంటున్నారు. కుమార్తె వివాహేత‌ర సంబంధం గురించి తండ్రి సూరా రాంబాబుకు తెలిసింది. కుమార్తెను పిలిచి ఇది ప‌ద్ద‌తి కాదు, ఊళ్లోవాళ్లు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు.. ఇలాంటి ప‌నులు వద్దూ అంటూ మంద‌లించాడు. కోపోద్రిక్తురాలైన కుమార్తె వెంక‌ట దుర్గ.. క‌న్న తండ్రేనే హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ విష‌యం ప్రియుడు ముమ్మిడ...