భారతదేశం, ఫిబ్రవరి 18 -- కోనసీమ జిల్లాలోని ముమ్మిడివ‌రం, మండ‌పేట‌లో ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరిగింది. పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోన‌సీమ జిల్లా ముమ్మిడివ‌రం మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన వివాహితుడు ప‌ర‌మ‌ట దుర్గా ప్ర‌సాద్ (బులి చంటి) (35).. సోమ‌వారం స్కూల్‌కు వెళ్తున్న ఎనిమిదో త‌ర‌గ‌తి బాలికకు మాయ మాట‌లు చెప్పి కిడ్నాప్ చేశాడు. బాలిక‌ను అమ‌లాపురం ఎర్ర‌వంతెన స‌మీపంలో ఒక నివాసానికి తీసుకెళ్లి.. అక్క‌డ ఆమెపై బ‌లవంతంగా అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు.

బాలిక వ‌ద్ద‌ని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ.. దాడి చేసి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. బాలిక క‌న‌పించ‌టం లేద‌ని వెతుకుతున్న ఆమె త‌ల్లిదండ్రుల‌కు.. కిడ్నాప్ అయింద‌నే విష‌యం తెలిసింది. వెంట‌నే ముమ్మిడివ‌రం పోలీసులను ఆశ్ర‌యించారు. త‌మ కుమార్తె ఉద‌యం స్కూల్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి బ‌య‌లు దేర...