భారతదేశం, ఫిబ్రవరి 27 -- Konaseema Crime: 'కోన‌సీమ మోనాలిసా' అంటూ ప‌దో త‌ర‌గ‌తి బాలిక వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువ‌కుడు పోస్టు చేశాడు. ఆ వీడియో వైర‌ల్ కావ‌డంతో బాలిక తోటి విద్యార్థినులు ఎగ‌తాళి చేయ‌డంతో ఆమె తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో బాలిక కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో యువ‌కుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లా ముమ్మిడివ‌రం మండలంలో చోటు చేసుకుంది. త‌ల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉండ‌టంతో బాలిక అమ‌లాపురంలోని త‌న పిన్ని వ‌ద్ద ఉంటూ చ‌దువుకుంటోంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ముమ్మిడివ‌రం మండ‌లం సీహెచ్ గున్నేప‌ల్లిలో ఈనెల 23న స‌త్తెమ్మ‌త‌ల్లి జాతర జ‌రిగింది.

ఈ జాత‌ర‌లో కుటుంబ జీవ‌నం కోసం అమ‌లాపురానికి చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని పూస‌లు అమ్మింది. అయితే ఆమె పూస‌లు అ...