భారతదేశం, ఏప్రిల్ 13 -- Komatireddy Rajgopal Reddy : తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని చెప్పారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "జానారెడ్డి ధర్మరాజు అనుకుంటే ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు" అని కోమటిరెడ్డి ఆరోపించారు.

Published by HT Digital Content Services with permission from HT Te...