భారతదేశం, మార్చి 4 -- Komaki X3: కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్ తన ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 52,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎస్ఈ, ఎక్స్-వన్, ఎంజీ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉన్న కొమాకి బ్రాండ్ పోర్ట్ఫోలియోలో కొత్తగా హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ 3 చేరింది.

ఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఒక ప్రత్యేక ఆఫర్ ను కూడా కొమాకి ప్రకటించింది. ఎక్స్ 3 వినియోగదారులు ఒకవేళ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటే, వారికి రూ. రూ. 99,999 లకే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని తెలిపింది. ఈ 'బై 2 ఎట్ రూ .99,999' ఆఫర్ ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవేశపెట్టింది. ఎక్స్3 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశం అంతటా అధీకృత డీలర్ షిప్ లలో, ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లలో లభిస్తుందని కోమాకి ...