Hyderabad, ఫిబ్రవరి 24 -- Kollagottinadhiro Song Lyrics: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీరమల్లు. ఈ మూవీ నుంచి సోమవారం (ఫిబ్రవరి 24) ఓ అదిరిపోయే సాంగ్ రిలీజైంది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగిపోయే ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశాడు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ నుంచి వచ్చిన రెండో పాట ఇది.

కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సాంగ్ ను ఆస్కార్ విన్నర్ కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, యామిని ఘంటసాలలాంటి వాళ్లు పాడారు. ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ గా నిలుస్తోంది. కీరవాణి మార్క్ బీట్ తో అలరిస్తోంది.

గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. ఈ రొమాంటిక్ సాంగ్ అదిరిపోయే బీట్...